Published on May 19, 2025
Current Affairs
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాలు
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాలు

గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశం నుంచి ఎక్కువగా ఎగుమతి అయిన వస్తువుల్లో స్మార్ట్‌ఫోన్లు అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ 2025, మే 18న తెలిపింది.

పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాల ఎగుమతుల బిల్లు కంటే అధిక విలువైన స్మార్ట్‌ఫోన్లే వివిధ దేశాలకు తరలి వెళ్లాయి.

2024-25లో భారత స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు 55% వృద్ధితో 24.14 బిలియన్‌ డాలర్ల (రూ.2 లక్షల కోట్ల)కు చేరాయి.

2022-23లో ఇవి 10.96 బి.డాలర్లుగా, 2023-24లో 15.57 బి.డాలర్లుగా ఉన్నాయి.

భారత్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు పెరిగిన దేశాల్లో అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్, చెక్‌ రిపబ్లిక్‌ ఉన్నాయి.

అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు 2022-23లో 2.16 బి.డాలర్లు, 2023-24లో 5.57 బి.డాలర్లుగా ఉండగా.. 2024-25లో 10.6 బి.డాలర్లకు వృద్ధి చెందాయి.

ప్రధానంగా ఐఫోన్‌ ఎగుమతులు గణనీయంగా పెరగడం ఇందుకు కారణం.

2024-25లో కట్‌ అండ్‌ పాలిష్ట్‌ వజ్రాల ఎగుమతులు 13.29 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.