Published on Sep 19, 2024
Current Affairs
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 2024, సెప్టెంబరు 18న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ.79,156 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. పప్పులు, నూనెగింజల సాగును పెంచేందుకు రూ.35,000 కోట్లతో రూపొందించిన పీఎం-ఆశా పథకానికి క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

* పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమర్పించిన నివేదికకు ఆమోదముద్ర వేసింది.

* వీనస్‌ ఆర్బిటర్‌ మిషన్, గగన్‌యాన్, చంద్రయాన్‌-4 మిషన్ల విస్తరణకు కూడా క్యాబినెట్‌ ఆమోదించింది.

* ఐఐటీలు, ఐఐఎంల తరహాలో యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్‌ఆర్‌) రంగంలో జాతీయ నైపుణ్య కేంద్రాన్ని ముంబయిలో ఏర్పాటు చేయడానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.