Published on Mar 18, 2025
Current Affairs
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా

కేంద్ర పన్నుల్లో 60% వాటా ఏడు రాష్ట్రాలకే వెళ్తోంది. అందులో ఉత్తర్‌ప్రదేశ్‌(18%), బిహార్‌(10%)లకు ఎక్కువ భాగం దక్కుతోంది. తొలిమూడు స్థానాల్లో ఉన్న యూపీ, బిహార్, మధ్యప్రదేశ్‌లకు కలిపి దాదాపు 36% వాటా వెళ్తోంది.

తొలి ఏడు స్థానాల్లో ఉన్న పైమూడు రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశాలకు కలిపి రూ.7,75,242.02 కోట్లు వెళ్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి సంజయ్‌చౌధరి 2025, మార్చి 17న లోక్‌సభలో వెల్లడించారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్చి 10వ తేదీ వరకు దేశంలోని 28 రాష్ట్రాలకు కలిపి కేంద్రం పన్నుల్లో వాటా కింద రూ.12,86,885.44 కోట్లు పంపిణీ చేయగా అందులో ఏడు రాష్ట్రాలకు 60%, మిగిలిన 21 రాష్ట్రాలకు కలిపి 40% దక్కినట్లు తేలింది.

దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలకు కలిపి రూ.2,03,327.38 కోట్లు (15.79%) దక్కాయి.