2014-24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,309 కోట్ల విలువైన 248 ఆర్‌ఓబీ, ఆర్‌యూబీలు (రైల్వే వంతెనలు) మంజూరు చేసినట్లు రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ 2024, డిసెంబరు 18న లోక్‌సభలో తెలిపారు.
ఫీడర్ స్థాయి సోలారైజేషన్ విధానం కింద ఆంధ్రప్రదేశ్‌కు లక్ష పంపులు మంజూరు చేసినట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయమంత్రి శ్రీపాద యశోనాయక్ 2024, డిసెంబరు 18న లోక్‌సభలో తెలిపారు. ఈ పథకం కింద రైతులు తమ భూముల్లో 2 మెగావాట్ల వరకు సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని డిస్కంలకు విద్యుత్తును విక్రయించవచ్చన్నారు.