ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ 2025, జనవరి 16న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన వేతన సవరణ సంఘం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో మూడో లాంచ్‌ప్యాడ్ (నూతన రాకెట్ ప్రయోగ వేదిక) ఏర్పాటు లాంటి నిర్ణయాలు తీసుకుంది.
కోటీ పదిహేను లక్షల మంది ఉద్యోగుల, పింఛనుదారుల జీతాలు, పింఛన్లు పెంచేందుకు 8వ వేతన సంఘం(పే కమిషన్) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగుస్తోంది.
ఏపీలోని శ్రీహరికోట ఇస్రో సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో రూ.3,984.86 కోట్ల అంచనా వ్యయంతో మూడో లాంచ్‌ప్యాడ్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
దీని ఏర్పాటు 48 నెలల్లో పూర్తికానుంది. మూన్‌మిషన్, అంతరిక్షంలో భారత్ స్టేషన్ ఏర్పాటు లక్ష్యాలకు అనుగుణంగా దీని ఏర్పాటు జరుగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.