అంతరిక్ష రంగంలో వచ్చే అంకుర పరిశ్రమల కోసం రూ.వెయ్యి కోట్ల ‘వెంచర్ క్యాపిటల్ ఫండ్’ ఏర్పాటు చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం 2024, అక్టోబరు 24న ఆమోదం తెలిపింది.
దీని ద్వారా సుమారు 40 స్టార్టప్‌లకు మద్దతు, అంతరిక్ష సంబంధిత పరిశ్రమల్లో ప్రైవేటు రంగానికి చేయూత లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
రూ.4,553 కోట్లతో బిహార్‌లోని నర్కటియాగంజ్- రక్సాల్- సీతామఢి- దర్భంగా, సీతామఢి-ముజఫర్‌పుర్ మార్గాల డబ్లింగ్‌కు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రూ.2,245 కోట్లతో 57 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను ప్రకటించింది. ఈ కొత్త మార్గాన్ని 160 కి.మీ. వేగంతో రైళ్లు రాకపోకలు సాగించేలా సెమీ హైస్పీడ్ కారిడార్‌గా నిర్మిస్తారు. ఇందుకోసం కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల సుదీర్ఘ వంతెనను నిర్మించనున్నారు.