ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 2025, జనవరి 29న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ కమిటీ సమావేశంలో దేశంలో కీలక ఖనిజాల అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకుంది.
ఏడేళ్ల వ్యవధిలో రూ.34,300 కోట్ల వ్యయం అంచనాతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్‌సీఎంఎం)కు ఆమోద ముద్ర వేసింది.
ఈ మిషన్‌కు కేంద్రం రూ.16,300 కోట్లు సమకూర్చనుంది. ప్రభుత్వరంగ సంస్థలు రూ.18 వేల కోట్లను అందించనున్నాయి.
కీలక ఖనిజాల (క్రిటికల్ మినరల్స్) రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా, హరిత ఇంధన రంగానికి ఊతం దిశగా ఈ మిషన్ దోహదం చేయనుంది.
మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ ఖనిజాల అన్వేషణను ప్రోత్సహిస్తుంది.