ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై), పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) అమలును 15వ ఆర్థిక సంఘం పదవీకాలానికి అనుగుణంగా కొనసాగించేందుకు క్యాబినెట్ అంగీకరించింది.
2024, జనవరి 1న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
దీనికోసం 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సర మధ్యకాలానికి కేటాయింపును రూ.69,515.71 కోట్లకు పెంచింది.
ఇదివరకు 2020-21 నుంచి 24-25 మధ్య కాలానికి రూ.66,550 కోట్లు కేటాయించింది.
ఈ పథకం అమలుచేస్తున్న రాష్ట్రాల్లో పండించే పంటలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించడానికి వీలవుతుంది.