విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కేంద్ర మంత్రివర్గం 2025, ఫిబ్రవరి 7న ఆమోదముద్ర వేసింది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఈ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు. తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో రాయగడ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మార్చినట్లు చెప్పారు.
ఇతర నిర్ణయాలు:
కొత్త ఆదాయపు పన్ను (ఐటీ) బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
నైపుణ్య భారత్ (స్కిల్ ఇండియా) కార్యక్రమాన్ని 2026 వరకు కొనసాగించేందుకు, దాన్ని పునర్‌వ్యవస్థీకరించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరోవైపు- జాతీయ సఫాయీ కర్మచారీ కమిషన్ (ఎన్‌సీఎస్‌కే) పదవీకాలాన్ని మరో మూడేళ్లపాటు (2028 మార్చి 31 వరకు) పొడిగించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.