Published on Mar 12, 2025
Admissions
కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక ప్రవేశాలు
కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక ప్రవేశాలు

కేంద్రీయ విద్యాలయాల్లో బాల్‌వాటిక 1, 2, 3ల్లో ప్రీ ప్రైమరీ, ఒకటి, రెండో  తరగతుల్లో ప్రవేశ ప్రకటనను కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్‌) విడుదల చేసింది.  

వివరాలు:

కేంద్రీయ విద్యాలయాల్లో బాల్‌వాటిక 2025 ప్రవేశాలు

బాలవాటిక 1,2,3, తరగతి 1, 2 ప్రవేశాలు

వయసు: బాల్‌వాటిక-1కు బాలబాలికల వయసు మార్చి 31, 2025 నాటికి మూడేళ్లు పూర్తయి నాలుగేళ్లు మించకుండా ఉండాలి. ఏప్రిల్‌ 1న జన్మించిన వారికీ అవకాశం ఉంటుంది.

బాల్‌వాటిక-2కు నాలుగేళ్లు పూర్తయి, అయిదేళ్లు మించకూడదు. బాలవాటిక-3లో ప్రవేశాలకు అయిదేళ్లు నిండి, ఆరేళ్లు మించకూడదు. ప్రత్యేకావసరాలు కలిగిన వారికి రెండేళ్ల

వయోసడలింపు ఉంటుంది. 

ఆన్‌లైన్‌ విధానంలో బాలవాటిక 1,3, తరగతి ఒకటి- రిజిస్ట్రేషన్‌ తేదీలు: మార్చి 7 నుంచి 21 వరకు.

బాలవాటిక 1,3 తొలి ప్రొవిజినల్‌ జాబితాను వెల్లడి: 26.03.2025. 

బాలవాటిక 1,3 రెండో ప్రొవిజినల్‌ జాబితా వెల్లడి: 02.04.2025.

బాలవాటిక 1,3 మూడో ప్రొవిజినల్‌ జాబితా వెల్లడి: 07.04.2025.

ఆఫ్‌లైన్‌ విధానంలో బాలవాటిక 2, తరగతి-II రిజిస్ట్రేషన్‌ తేదీలు: 18.04.2025- 21.04.2025.

Website: https://kvsonlineadmission.kvs.gov.in/index.html