కేంద్రీయ విద్యాలయాల్లో బాల్‌వాటిక, ఒకటి, రెండు ఆపైన తరగతులు, 11వ తరగతుల్లో ప్రవేశ ప్రకటనను కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) విడుదల చేసింది. మూడేళ్లకు పైబడి ఆరేళ్ల లోపు వయసు కలిగిన బాలబాలికలు అడ్మిషన్లు పొందవచ్చు.
వివరాలు:
కేంద్రీయ విద్యాలయాల్లో బాల్‌వాటిక, ఒకటో, రెండో తరగతుల్లో ప్రవేశాలు-2026
బాలవాటిక 1,2,3, తరగతి 1, 2 ప్రవేశాలు
వయసు: బాలబాలికల వయసు మార్చి 31, 2026 నాటికి బాల్‌వాటిక-1కు మూడేళ్లు పూర్తయి నాలుగేళ్లు మించకుండా ఉండాలి. బాల్‌వాటిక-2కు నాలుగేళ్లు పూర్తయి, అయిదేళ్లు మించకూడదు. బాలవాటిక-3లో ప్రవేశాలకు అయిదేళ్లు నిండి, ఆరేళ్లు మించకూడదు. ప్రత్యేకావసరాలు కలిగిన వారికి రెండేళ్ల వయోసడలింపు ఉంటుంది. (ఏప్రిల్ 1వ తేదీన జన్మించిన విద్యార్థిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు).
ఆన్‌లైన్ విధానంలో బాలవాటిక 1,3, తరగతి ఒకటి- రిజిస్ట్రేషన్ తేదీలు: మార్చి 20 నుంచి ఏప్రిల్ 2 వరకు.
బాలవాటిక 1,3 తొలి ప్రొవిజినల్ జాబితాను వెల్లడి: 08.04.2026.
బాలవాటిక 1,3 తొలి జాబితాను వెల్లడి: 09.04.2026.
బాలవాటిక 1,3 రెండో ప్రొవిజినల్ జాబితా వెల్లడి (సీట్ల ఖాళీల ఆధారంగా): 16.04.2026.
బాలవాటిక 1,3 మూడో ప్రొవిజినల్ జాబితా వెల్లడి: 21.04.2026..
ఆఫ్‌లైన్ విధానంలో బాలవాటిక 2, తరగతి-II, ఆపై తరగతుల్లో రిజిస్ట్రేషన్ తేదీలు: 02.04.2026- 08.04.2026.
తొలి ఎంపిక జాబితా: 13.04.2026.
11వ తరగతి ప్రవేశాలకు: పదో తరగతి ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి.
Website:https://kvsangathan.nic.in/