Published on Mar 7, 2025
Admissions
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు

దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ప్రకటనను కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌) విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. 

వివరాలు:

కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలు 

సీట్ల రిజర్వేషన్‌: ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయించారు.

వయసు ప్రమాణాలు:

వయసు: ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలంటే మార్చి 31 నాటికి విద్యార్థి వయసు ఆరు నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉండాలి. రెండో తరగతి ప్రవేశానికి ఏడు నుంచి తొమ్మిదేళ్ల మధ్య, మూడు, నాలుగో తరగతులకు 8-10, అయిదో తరగతికి 9-11, ఆరుకు 10-12, ఏడుకు 11-13, ఎనిమిదికి 12-14, తొమ్మిదికి 13-15, పదికి 14-16 ఏళ్ల మధ్య.. ఇలా ప్రతి తరగతికీ నిర్దేశించిన మేరకు వయసు ఉండాలి. రిజర్వుడ్‌ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఒకటో తరగతి ప్రవేశాలు ఆన్‌లైన్ లాటరీ సిస్టమ్ ద్వారా, రెండు నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టం ప్రకారం సీటు కేటాయిస్తారు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ సిస్టం ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. పదకొండో తరగతి ప్రవేశాలకు సంబంధించి పదోతరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పదో తరగతిలో సీట్లు మిగిలితే ప్రవేశాలు నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: 

ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా; రెండు ఆపై తరగతులకు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఒకటో తరగతి ప్రవేశాల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తేదీలు: మార్చి 1 నుంచి మార్చి 21 వరకు.

ఒకటో తరగతి తొలి ప్రొవిజినల్‌ లిస్ట్‌ వెల్లడి: మార్చి 25.

రెండో ప్రొవిజినల్‌ జాబితా వెల్లడి: ఏప్రిల్‌ 04

మూడో ప్రొవిజినల్‌ జాబితా వెల్లడి: ఏప్రిల్‌ 07.

రెండు, ఆ పైతరగతుల్లో (11వ తరగతి మినహాయించి) ఖాళీగా ఉండే సీట్ల భర్తీ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: జులై 31. 

రెండో తరగతికి ఎంపికైన వారి జాబితా వెల్లడి: ఏప్రిల్‌ 17. 

11వ తరగతి మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు తుది గడువు: జూన్‌ 30. 

11వ తరగతి ప్రవేశాల రిజిస్ట్రేషన్: కేవీ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు పదో తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు.

Website:https://kvsangathan.nic.in/en/

Apply online:https://kvsonlineadmission.kvs.gov.in/index.html