Published on Nov 15, 2025
Government Jobs
కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో ఉద్యోగాలు
కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వంలోని విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే స్వయంప్రతిపత్తి సంస్థలైన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్‌), నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌), దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025ను విడుదల చేశాయి. ఈ నియామక ప్రక్రియను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్వహిస్తుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14,967

వివరాలు:

పోస్టుల వారీగా ఖాళీలు:

1. అసిస్టెంట్ కమిషనర్ – 17 పోస్టులు

వయో పరిమితి: కేవీఎస్‌ - 50 సంవత్సరాల వరకు, ఎన్‌వీఎస్‌ - 45 సంవత్సరాల వరకు

విద్యార్హతలు: 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ,  B.Ed./ఇంటిగ్రేటెడ్ B.Ed–M.Ed,  ప్రిన్సిపల్ గా 3 సంవత్సరాలు చేసి ఉండాలి,  హిందీ, ఇంగ్లిష్  & కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

2. ప్రిన్సిపల్ – 227 పోస్టులు (KVS 134 + NVS 93)

వయో పరిమితి: 35–50 సంవత్సరాలు

విద్యార్హతలు:

◆ 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ

◆ B.Ed./ఇంటిగ్రేటెడ్ B.Ed–M.Ed

◆ వైస్ ప్రిన్సిపల్ / PGTగా చేసి ఉండాలి.

◆ హిందీ, ఇంగ్లిష్ & కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలి.

3. వైస్ ప్రిన్సిపల్ – 58 పోస్టులు (KVS)

వయో పరిమితి: 35–45 సంవత్సరాలు

విద్యార్హతలు:

◆ 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ

◆ B.Ed.

◆ 6 సంవత్సరాల PGT అనుభవం

◆ హిందీ/ఇంగ్లిష్ పరిజ్ఞానం

4. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs) – 2,996 పోస్టులు

వయో పరిమితి: 40 సంవత్సరాల వరకు

విద్యార్హతలు:

◆ సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో PG

◆ B.Ed. / ఇంటిగ్రేటెడ్ B.Ed–M.Ed

◆ ఇంగ్లిష్ & హిందీలో బోధించే సామర్థ్యం ఉండాలి.

సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, చరిత్ర, భూగోళశాస్త్రం, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, MILలు (18 పోస్టులు).

5. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGTs) – 6,215 పోస్టులు

వయో పరిమితి: 35 సంవత్సరాల వరకు

విద్యార్హతలు:

◆ 50% మార్కులతో గ్రాడ్యుయేషన్

◆ B.Ed. / ఇంటిగ్రేటెడ్ B.Ed–M.Ed

◆ CTET (పేపర్-II) లో అర్హత సాధించి ఉండాలి.

◆ ద్విభాషా సామర్థ్యం (Bilingual ability)

పోస్టులు: ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, ఆర్ట్, సంగీతం, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, కంప్యూటర్ సైన్స్, 3వ భాష TGTలు (443 పోస్టులు).

6. ప్రైమరీ టీచర్ – PRT – 2,684 పోస్టులు

వయో పరిమితి: 30 సంవత్సరాల వరకు

విద్యార్హతలు:

◆ 12వ తరగతి 50% మార్కులతో + 2-సంవత్సరాల D.El.Ed / B.El.Ed

◆ CTET (పేపర్-I)లో అర్హత సాధించి ఉండాలి.

◆ ఇంగ్లిష్ & హిందీ కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.

7. PRT (సంగీతం) – 187 పోస్టులు

విద్యార్హతలు:

◆ సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత + సంగీతంలో డిగ్రీ/డిప్లొమా

◆ ఇంగ్లిష్ & హిందీలో నైపుణ్యం

8. స్పెషల్ ఎడ్యుకేటర్ (పీఆర్‌టీ)- 494

విద్యార్హతలు:

◆ RCI ఆమోదించిన అర్హతలు

◆ CTET అర్హత కలిగి ఉండాలి.

◆ RCI రిజిస్ట్రేషన్ తప్పనిసరి

9. లైబ్రేరియన్- 147 పోస్టులు (KVS 147)

విద్యార్హతలు:

◆ B.Lib / B.L.I.Sc

◆ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

10. KVS బోధనేతర పోస్టులు – 1,155 పోస్టులు

పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ I & II.

విద్యార్హతలు: పోస్టును బట్టి 12వ తరగతి/గ్రాడ్యుయేషన్/టైపింగ్/టెక్నికల్ డిప్లొమాలు కలిగి ఉంటాయి (వివరాలకు పూర్తి నోటిఫికేషన్ చూడవచ్చు).

11. NVS బోధనేతర పోస్టులు – 787 పోస్టులు

పోస్టులు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్.

విద్యార్హతలు: పోస్టును బట్టి 10వ తరగతి/12వ తరగతి/గ్రాడ్యుయేషన్ (వివరాలకు పూర్తి నోటిఫికేషన్ చూడవచ్చు).

దరఖాస్తు  విధానం:

ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం:

టైర్‌1, టైర్‌2, నైపుణ్య పరీక్ష (టైపింగ్/స్టెనోగ్రఫీ/ట్రాన్స్‌లేషన్‌- పోస్టులను అనుసరించి), ఇంటర్వ్యూ (ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కొన్ని కేటగిరీల పీజీటీ) ధృవపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టైర్‌2లో ప్రతి తప్పు సమాధానానికి 1/4 నెగటివ్‌ మార్కింగ్‌ (అంటే 0.25 మార్కులు) ఉంటుంది.

టైర్‌-1 పరీక్ష వివరాలు (ఇది క్వాలిఫైయింగ్‌ పరీక్ష) ఓఎంఆర్‌ ఆధారిత అడ్జెక్టివ్‌ పరీక్ష, వ్యవధి: 2 గంటలు. మొత్తం ప్రశ్నలు: 100; 300మార్కులకు ఉంటుంది. 

టైర్‌-1లో ఎన్‌వీస్‌ మల్టీ టాస్కింగ్‌ మినహా అన్ని పోస్టులకు పరీక్షా విధానం:

జనరల్‌ రిజనీంగ్‌ (20 ప్రశ్నలు, 60 మార్కులు), న్యూమరిక్‌ ఎబిలిటీ (20 ప్రశ్నలు, 60 మార్కులు), బేసిక్‌ కంప్యూటర్‌ లిటరసీ 20 ప్రశ్నలు, 60 మార్కులు), జనరల్‌ నాలెడ్జ్‌ 20 ప్రశ్నలు, 60 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 10 ప్రశ్నలు, 30 మార్కులు), ఒక మోడ్రన్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌ (10 ప్రశ్నలు, 30 మార్కులు).

టైర్‌-1లో ఎన్‌వీస్‌ మల్టీ టాస్కింగ్‌ పరీక్ష విధానం:

జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ (20 ప్రశ్నలు 60 మార్కులు), బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ (40 ప్రశ్నలు 120 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (20 ప్రశ్నలు 60 మార్కులు), ఒక మోడ్రన్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌ (20 ప్రశ్నలు, 60 మార్కులు).

దరఖాస్తుకు చివరి తేదీ: 

KVS/NVS/CBSE వెబ్‌సైట్‌ల్లో త్వరలో ప్రకటిస్తారు. అభ్యర్థులు అధికారిక పోర్టళ్లను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి. (14 డిసెంబరు)

Website:https://www.cbse.gov.in/cbsenew/recruitment.html

Online Application:https://examinationservices.nic.in/recsys2025/root/Home.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFbEsl0hvvhEEwgxfU0IzC28jtU4yhpqb3pomlo4g+VC8