Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 23, 2026
Current Affairs
కృత్రిమ మేధ(ఏఐ) ట్యూటర్‌
కృత్రిమ మేధ(ఏఐ) ట్యూటర్‌

  • ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధ(ఏఐ) ట్యూటర్‌ విధానాన్ని తీసుకొస్తోంది. ఐఐటీ మద్రాస్‌ రూపొందించిన డిజిటల్‌ లెర్నింగ్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి దిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో ఐఐటీ మద్రాస్‌తో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలలకు ఐఐటీ మద్రాస్‌ ఈ సాంకేతిక సహాయాన్ని ఉచితంగా అందించనుంది.
  • పాఠశాల విద్యాశాఖ వద్ద ఉన్న కంటెంట్‌ను ఐఐటీ మద్రాస్‌కు అందిస్తుంది. దీన్ని విద్యార్థుల డివైజెస్‌కు అక్కడి నుంచి పంపిస్తారు. తెలుగు, ఆంగ్లం హిందీ భాషల్లో కంటెంట్‌ ఉంటుంది.