భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్‌ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, ఏప్రిల్ 29న నియమించారు. మే 14న ఆయన చేత రాష్ట్రపతి ప్రమాణం చేయిస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో 52వ సీజేఐగా జస్టిస్ బి.ఆర్.గవాయ్‌ని రాష్ట్రపతి నియమించారు.