Published on Apr 28, 2025
Current Affairs
కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు
కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు 2025, ఏప్రిల్‌ 27న నియమితులయ్యారు. ఆర్థికశాఖ పదవిలోనూ ఆయననే అదనపు బాధ్యతలతో కొనసాగుతారు. ప్రస్తుత సీఎస్‌ శాంతికుమారి ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. 
1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్గొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో సబ్‌కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌గా, గుంటూరు, ఆదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్‌గా, విద్యాశాఖ కమిషనర్‌గా, ప్రణాళికాశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు.