తెలంగాణలో కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకొన్న ముగ్గురు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం 2025, జూన్ 11న ఉత్తర్వులు జారీ చేసింది. జి.వివేక్‌కు గనులు, కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీస్ శాఖలు; వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసులు, మత్స్యశాఖలు; అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖలను కేటాయించారు. ఇవన్నీ ఇప్పటివరకు సీఎం రేవంత్‌రెడ్డి వద్దనే ఉన్నాయి.