Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 21, 2026
Current Affairs
కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025
కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025
  • ఆరు దశాబ్దాల నాటి పాత పన్ను చట్టం-1961 స్థానంలో తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) 2026, మార్చి 20న ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను నోటిఫై చేసింది. 2026 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.
  • ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) కింద తమ మూల వేతనంలో 50% పన్ను మినహాయింపు పొందే నగరాల జాబితాను కేంద్రం ప్రస్తుత 4 నుంచి 8కి పెంచింది. ఇప్పటి వరకు దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాలకే పరిమితమైన ఈ ప్రయోజనాన్ని.. కొత్త నిబంధనల ద్వారా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు నగరాలకూ విస్తరించింది. ఇతర నగరాలు, పట్టణాల్లో నివసించే వారికి 40% పరిమితి కొనసాగుతుంది. ఈ పన్ను మినహాయింపులు పొందాలంటే అద్దెదారు, ఇంటి యజమాని మధ్య ఉన్న అద్దె ఒప్పందం/సంబంధ వివరాలు వెల్లడించడం తప్పనిసరి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కొత్త పన్ను విధానంలో ఉన్న వారికి హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు ఉండదు. పాత పన్ను విధానంలో రిటర్నులు దాఖలు చేసేవారికే ఇది వర్తిస్తుంది.