Published on Oct 21, 2024
Admissions
కిత్తూరు రాణి చెన్నమ్మ బాలికల సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలు
కిత్తూరు రాణి చెన్నమ్మ బాలికల సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలు

కర్ణాటక రాష్ట్రం కిత్తూరులోని కిత్తూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ సైనిక్‌ స్కూల్‌ ఫర్‌ గర్ల్స్‌- 2025-26 విద్యా సంవత్సరానికి ఆరోతరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ‘ఆలిండియా ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌’ ద్వారా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ పాఠశాలలో ప్రవేశం పొందిన బాలికలు 12వ తరగతి(సైన్స్‌ స్ట్రీం) వరకు చదువుకోవచ్చు. సైనిక్‌/ మిలిటరీ స్కూల్స్‌ నిబంధనల ప్రకారం సీబీఎస్‌ఈ విధానంలో బోధన ఉంటుంది. 

వివరాలు:

కిత్తూరు రాణి చెన్నమ్మ గురుకుల బాలికల సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలు

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. నిర్దిష్ట శారీర ప్రమాణాలు తప్పనిసరి.

వయసు: విద్యార్థినులు 2025 జూన్‌ 1 నాటికి పదేళ్లు నిండి పన్నెండేళ్లలోపు ఉండాలి.

ప్రవేశ విధానం: జాతీయ స్థాయిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత పొందిన వారికి ఇంటర్య్వూలు, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టులు ఉంటాయి.

పరీక్ష వివరాలు: ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ను ఇంగ్లీష్‌, కన్నడ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. విద్యార్థినులు దరఖాస్తులో సూచించిన మాధ్యమంలో మాత్రమే ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. ప్రశ్నపత్రంతోపాటే ఆన్సర్‌ బుక్‌లెట్‌ను ఇస్తారు. పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ మేథమెటిక్స్‌- 150 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌- 50 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌- 50 మార్కులు, ఇంటెల్లిజెంట్‌ కోషంట్‌/ మెంటల్‌ ఎబిలిటీ- 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. 

పరీక్ష ఫీజు: సాధారణ అభ్యర్థులకు రూ.2000, ఎస్సీ/ ఎస్టీలకు (కర్ణాటకలో నివసిస్తున్న వారికి మాత్రమే) రూ.1600.

పరీక్ష కేంద్రాలు: కిత్తూర్‌, విజయపూర్‌, బెంగళూరు, కలబురగి.

స్కూలు వార్షిక ఫీజు: రూ.2,24,300.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ కేటగిరీ విద్యార్థినులకు రూ.2,000; ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు రూ.1600

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: ద ప్రిన్సిపల్‌, కిత్తూర్‌ రాణి చెన్మమ్మ రెసిడెన్షియల్‌ సైనిక్‌ స్కూల్‌ ఫర్‌ గర్ల్స్‌, కిత్తూర్‌ 591115, బెలగావి జిల్లా, కర్ణాటక.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.10.2024.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 15.12.2024.

ఆలస్య రుసుముతో దరఖాస్తుకు తేదీలు: 16.12.2024 నుంచి 31.12.2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 02.02.2025.

Website:https://kittursainikschool.org/entrance-examination/

Apply online:https://www.onlinesbi.sbi/sbicollect/icollecthome.htm?corpID=635450