రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు విమానాశ్రయాలను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2025, జనవరి 3న వెల్లడించారు.
కుప్పంలో రెండు దశల్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది.
శ్రీకాకుళంలో రెండు దశల్లో 1,383 ఎకరాల్లో వియానాశ్రయం నిర్మిస్తారు.
దగదర్తిలో విమానాశ్రయాన్ని 1,379 ఎకరాల్లో నిర్మించనున్నారు.
ఒంగోలులో 657 ఎకరాలను విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం గుర్తించింది.
పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లో 1,670 ఎకరాల్లో, తాడేపల్లిగూడెంలో 1,123 ఎకరాల్లో విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తుని-అన్నవరం మధ్య విమానాశ్రయ నిర్మాణానికి¨ 757 ఎకరాలను ప్రభ్తుత్వం గుర్తించింది.