భక్తులకు అందిస్తున్న సేవలకు గుర్తుగా చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి ఐఎస్‌వో గుర్తింపు లభించింది. పాలనావ్యవస్థ, క్యూలైన్లు, పరిశుభ్రత, ప్రసాదం తయారీ, అన్నదానం, పడితరం గిడ్డంగి నిర్వహణ మొదలైనవి ఐఎస్‌వో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన హైమ్ సంస్థ నిర్ధారించింది. ఐఎస్‌వో గుర్తింపు ధ్రువపత్రాలను ఆలయ అధికారులకు 2025, డిసెంబరు 31న అందజేశారు.