Published on Sep 28, 2024
Admissions
కొండా లక్ష్మణ్ వర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులు
కొండా లక్ష్మణ్ వర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులు

సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి హార్టికల్చర్‌ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. ఎంఎస్సీ (హార్టికల్చర్): 30 సీట్లు

స్పెషలైజేషన్: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్‌ ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్, ఆరోమాటిక్‌ క్రాప్స్‌.

అర్హత: బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ (హార్టికల్చర్‌)తో పాటు ఐకార్‌- ఏఐఈఈఏ (పీజీ)-2024 స్కోరు సాధించి ఉండాలి.

2. పీహెచ్‌డీ (హార్టికల్చర్): 06 సీట్లు

స్పెషలైజేషన్: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్‌ ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్, ఆరోమాటిక్‌ క్రాప్స్‌.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ (హార్టికల్చర్)తో పాటు ఐకార్‌ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2024 స్కోరు సాధించి ఉండాలి.

వయస్సు: గరిష్ఠ వయోపరిమితి 31 డిసెంబర్ 2024 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. 

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, జాతీయ స్థాయి పరీక్షల్లో సాధించిన స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్సీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.750. మిగతా అభ్యర్థులందరికీ రూ.1500.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ 

దరఖాస్తులను ది రిజిస్ట్రార్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌, ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ, ములుగు, సిద్దిపేట జిల్లా చిరునామాకు పంపాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14-10-2024.

Website:https://www.skltshu.ac.in/