Published on May 3, 2025
Government Jobs
కడప ఎంఈడీలో వివిధ పోస్టులు
కడప ఎంఈడీలో వివిధ పోస్టులు

మెడికల్ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్, కడప ఒప్పంద ప్రాతిపదికన కింది  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 69

వివరాలు:

1. అనస్థీషియా టెక్నీషియన్‌: 04

2. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌: 06

3. ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2: 09

4. జూనియర్‌ అసిస్టెంట్: 02

5. డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌: 02

6. ఎలక్ట్రీషియన్‌: 01

7. జనరల్ డ్యూటీ అటెండెంట్‌: 44

8. ప్లంబర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(బీఎస్సీ), ఇంటర్‌, ఐటీఐ, పదో తరగతి, పీజీ డిప్లొమా, డీఎంఎల్‌టీ, ఎంఎల్‌టీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 42 ఏళ్లు.

జీతం: నెలకు అనస్థీషియా టెక్నీషియన్‌, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2కు రూ.32,670, జూనియర్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌, ఎలక్ట్రీషియన్‌కు రూ.18,500, జనరల్ డ్యూటీ అటెండెంట్‌, ప్లంబర్‌కు రూ.15,000.

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.400, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300.

ఎంపిక ప్రక్రియ: విద్వార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 మే 10.

దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 20.

చిరునామా: అడిషనల్ డీఎంఈ/ప్రిన్సిపల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, పుట్లంపల్లి, కడప, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా.

Website:https://kadapa.ap.gov.in/notice/gmc-kadapa-recruitment-notification-for-filling-up-of-the-contract-outsourcing-posts-in-super-speciality-hospital-kadapa/