Published on Dec 30, 2025
Current Affairs
‘కుటుంబ వినియోగ వ్యయం 2023-24’ నివేదిక
‘కుటుంబ వినియోగ వ్యయం 2023-24’ నివేదిక

కేంద్ర గణాంకశాఖ ఇటీవల ‘కుటుంబ వినియోగ వ్యయం 2023-24’ నివేదికను విడుదల చేసింది.

దీని ప్రకారం, పానీయాలు, చిరుతిళ్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ (శుద్ధి చేసిన ఆహారం) కోసమే దేశవ్యాప్తంగా ప్రజలు తమ నెలవారీ ఖర్చుల్లో అత్యధిక భాగాన్ని వెచ్చిస్తున్నారు.

గ్రామీణ ప్రజలు వీటిపై 9.84%, పట్టణవాసులు 11.09% ఖర్చు పెడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. 

గ్రామీణుల ఖర్చులో పండ్లు 6వ స్థానంలో ఉండగా, పట్టణ వాసుల జాబితాలో అది 4వ స్థానాన్ని ఆక్రమించింది.

ఆహారం, ఆహారేతర అవసరాలకోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సగటున రూ.4,122, పట్టణ ప్రాంతాల్లో రూ.6,996 ఖర్చు చేస్తున్నారు.

ఇందులో సిక్కిం వాసులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక వ్యయంతో తొలి స్థానాన్ని ఆక్రమించగా, ఛత్తీస్‌గఢ్‌ వాసులు చివరి స్థానానికి పరిమితమయ్యారు.