ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2026 విద్యా సంవత్సరానికి బోధనేతర సిబ్బందిని (టైప్-III: 564, టైప్-IV: 531) భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలను జారీ చేసింది. ఔట్‌సోర్సింగ్ (పొరుగుసేవల) ప్రాతిపదికన, వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపడతారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 1,095
వివరాలు:
టైప్-III ఖాళీలు:
1. ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్: 77 పోస్టులు
2. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్- 134
3. ఏఎన్‌ఎం- 110
4. అకౌంటెంట్- 11 పోస్టులు
5. అటెండర్: 28 పోస్టులు
6. హెడ్ కుక్- 22
7. అసిస్టెంట్ కుక్- 89
8. డే వాచ్ ఉమెన్- 18
9. నైట్ వాచ్ ఉమెన్- 26
10. స్కావెంజర్- 33
11. స్వీపర్- 16
టైప్-IV ఖాళీలు:
1. వార్డెన్: 86 పోస్టులు
2. పార్ట్-టైం టీచర్: 122 పోస్టులు
3. చౌకీదార్: 77 పోస్టులు
4. హెడ్‌కుక్: 76 పోస్టులు
5. అసిస్టెంట్ కుక్: 170 పోస్టులు
అర్హతలు:
హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, వాచ్ ఉమెన్, చౌకిదార్, అటెండర్ వంటి పోస్టులకు ప్రత్యేక విద్యార్హత తప్పనిసరి కాదు.
కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌కు ఇంటర్/డిగ్రీ+ కంప్యూటర్ కోర్స్, వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్‌కు టెన్త్, సంబంధిత ట్రేడ్ సర్టిఫికేట్, ఏఎన్‌ఎంకు ఇంటర్+ఏఎన్‌ఎం శిక్షణ, వార్డెన్‌కు/పార్ట్‌టైం టీచర్‌కు డిగ్రీ+బీఎడ్/ఎంఏ ఉత్తీర్ణత ఉండాలి.
వయో పరిమితి: 01-07-2025 నాటికి 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా. మెరిట్, రిజర్వేషన్, లోకల్ క్యాండిడేట్ ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక ఉంటుంది. జిల్లా స్థాయి సెలెక్షన్ కమిటీ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కార్యాలయంలో అవసరమైన ధ్రువపత్రాలతో నేరుగా అందజేయాలి.
రిక్రూట్‌మెంట్ షెడ్యూల్:
నోటిఫికేషన్ విడుదల తేదీ: 05-01-2026.
ఏపీసీ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ: 06-01-2026 నుంచి 20-01-2026 వరకు.
మండలాల వారీగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా తయారీ: 23-01-2026.
అభ్యర్థుల తొలి జాబితా లిస్ట్: 28.01.2026.
తుది జాబితా లిస్ట్: 04.02.2026.
ఇంటర్వ్యూ తేదీ: 05.02.2026.
Website:https://vizianagaram.ap.gov.in/notice_category/recruitment/