Published on Sep 27, 2024
Government Jobs
కేజీబీవీల్లో ఉద్యోగాలు
కేజీబీవీల్లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2024-25 విద్యా సంవత్సరం (ఏడాది) కాలానికి బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి ఏపీ ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసింది.

మొత్తం ఖాళీల సంఖ్య: 604.

వివరాలు: 

1. ప్రిన్సిపల్- 10 పోస్టులు

2. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (PGT)- 165 పోస్టులు

సబ్జెక్టులు: ఇంగ్లిష్/ సివిక్స్/ కామర్స్/ మ్యాథ్స్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బోటనీ/ జువాలజీ/ ఒకేషనల్.

3. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (CRT)- 163 పోస్టులు

సబ్జెక్టులు: తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్.

4. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (PET)- 4 పోస్టులు

5. పార్ట్ టైం టీచర్ (PTT)- 165 పోస్టులు

6. వార్డెన్- 53 పోస్టులు

7. అకౌంటెంట్- 44 పోస్టులు

శ్రీసత్యసాయి జిల్లా(61)లో ఎక్కువ , ఏలూరు జిల్లా(1)లో తక్కువ బోధనా ఖాళీలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఎక్కువ (11), బాపట్ల(1)/ విశాఖ(1)/ ఎన్‌టీఆర్‌ (1) జిల్లాల్లో తక్కువ బోధనేతర ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ, యూజీడీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ ఉత్తీర్ణత. 

వయోపరిమితి: ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

గౌరవ వేతనం: నెలకు ప్రిన్సిప్‌ల్‌కు రూ.34139, పీజీటీకి రూ.26759, సీఆర్టీకి రూ.26759, పీఈటీకి రూ.26759, అకౌంటెంట్‌కు రూ.18500, వార్డెన్‌కు రూ.18500, పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.18500.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మార్కులు, సర్వీస్ వెయిటేజీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము: రూ.250. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ: 10-10-2024 

మెరిట్ జాబితా వెల్లడి తేదీలు: 14-10-2024 నుంచి 16-10-2024 వరకు.

జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు: 17-10-2024 నుంచి 18-10-2024 వరకు.

తుది మెరిట్ జాబితాపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం: 21-10-2024.

తుది మెరిట్ జాబితా వెల్లడి: 23-10-2024.

నియామక ఉత్తర్వుల జారీ: 23-10-2024.

కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌ తేదీ: 23-10-2024.

డ్యూటీ రిపోర్టింగ్ తేదీ: 24-10-2024.

Website:https://apkgbv.apcfss.in/

Apply online:https://welfarerecruitments.apcfss.in/kgbvDRecruitmentPaymentForm.do