Published on Dec 25, 2025
Government Jobs
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో వర్క్‌మెన్ కేటగిరి పోస్టులు
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో వర్క్‌మెన్ కేటగిరి పోస్టులు

కేరళలోని భారత ప్రభుత్వ మినీరత్న షెడ్యూల్‌ ఏ సంస్థ అయిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ వర్క్‌మెన్‌ కేటగిరిలో వివిధ టెక్నికల్, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 132

వివరాలు: 

సీనియర్ షిప్ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (మెకానికల్, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 30

జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 53

ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ (మెకానికల్‌, కెమికల్‌): 06

స్టోర్‌ కీపర్‌: 09

అసిస్టెంట్‌: 34

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60శాతం మార్కులతో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

పే స్కేల్‌: నెలకు అసిస్టెంట్‌ పోస్టుకు రూ.22,500- రూ.73,750; ఇతర పోస్టులకు రూ.23,500- రూ.77,000.

వయోపరిమితి: చివరి తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: సీనియర్ షిప్ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌కు ఆబ్జెక్టీవ్‌ సీబీటీ, ప్రాక్టికల్‌ టెస్ట్‌ (ఫేజ్‌-1, ఫేజ్‌-2); ఇతర పోస్టులకు సీబీటీ, డిస్క్రిఫ్టివ్‌ టైప్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ రూ.700; ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 12.01.2026.

Website:https://cochinshipyard.in/