కేరళ రాష్ట్రం కొచ్చిలోని ప్రభుత్వరంగ సంస్థ- కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 11
వివరాలు:
1. సెరాంగ్- 09
2. ఇంజిన్ డ్రైవర్- 01
3. లాస్కర్ (ఫ్లోటింగ్ క్రాఫ్ట్)-01
అర్హత: ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పోస్టుకు సంబంధించి సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
జీతం: నెలకు సెరాంగ్, ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు మొదటి ఏడాది రూ.23,300 రెండో ఏడాది రూ.24,000; మూడో ఏడాది రూ.24,800; లాస్కర్ పోస్టులకు మొదటి ఏడాది రూ.22100, రెండో ఏడాది రూ.22,800; మూడో ఏడాది రూ.23,400.
వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ అభ్యర్థులకు 5ఏళ్లు; ఓబీసీ వారికి మూడేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.200, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 13-02-2025.
Website:https://cochinshipyard.in/