Published on Nov 15, 2024
Government Jobs
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో వర్క్‌మెన్ ఖాళీలు
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో వర్క్‌మెన్ ఖాళీలు

ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కేరళలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన వర్క్‌మెన్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 71

పోస్టు పేరు - ఖాళీలు: 

1. స్కాఫ్‌ఫోల్డర్: 21

2. సెమీ స్కిల్డ్‌ రిగ్గర్: 50

అర్హత: సెమీ స్కిల్డ్‌ రిగ్గర్ పోస్టుకు నాలుగో తరగతి, స్కాఫ్‌ఫోల్డర్‌కు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు మొదటి ఏడాది రూ.22,100; రెండో ఏడాది రూ.22,800; మూడో ఏడాది రూ.23,400.

దరఖాస్తు ఫీజు: రూ.200; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ప్రాక్టికల్/ఫిజికల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 29-11-2024.

Website:https://cochinshipyard.in/