Published on Oct 16, 2024
Apprenticeship
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు

ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కేరళలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్ (సీఎస్ఎల్) అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 307

వివ‌రాలు:

1. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్: 299

2. టెక్నీషియన్ అప్రెంటిస్: 8

విభాగాలు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్/ సివిల్‌), పెయింటర్ (జనరల్/ మెరైన్), అకౌంటింగ్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, ఫుడ్ అండ్ క్రాఫ్ట్ బేకర్ తదితరాలు.

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (వీహెచ్ఎస్ఈ) ఉత్తీర్ఱత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 23-10-2024 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. 

స్టైపెండ్: నెలకు ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.8,000; టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.9,000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, షార్ట్‌లిస్ట్ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 23-10-2024.

Website:https://cochinshipyard.in/