Published on Feb 21, 2025
Government Jobs
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఖాళీలు
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఖాళీలు

కొచ్చిన్ పోర్ట్ అథారిటీ (సీపీఏ), కేరళ కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 65

వివరాలు:

1. టగ్ హ్యాండ్లర్‌: 02

2. జి.పి క్ర్యూ: 46

3. జి.పి క్ర్యూ ఇంజిన్‌: 05

4. జి.పి.క్ర్యూ ఎలక్ట్రికల్: 02

5. టెక్నికల్ సూపర్‌వైజర్‌: 01

6. మెరైన్‌ మోటర్‌ మెకానిక్‌: 04

7. ఫైర్‌ సూపర్‌వైజర్‌: 03

8. సీమెన్‌ గ్రేడ్‌-2: 01

9. వించ్‌ ఆపరేటర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: వించ్ ఆపరేటర్‌, సీమెన్‌ గ్రేడ్‌-2కు 60 ఏళ్లు, టెక్నికల్ సూపర్ వైజర్‌, మెరైన్‌ మోటర్‌ మెకానిక్‌, ఫైర్‌ సూపర్‌ వైజర్‌కు 40 ఏళ్లు, జి.పి క్ర్యూకు 46 ఏళ్లు, టగ్‌ హ్యాండ్లర్‌కు 58 ఏళ్లు నిండి ఉండాలి.

జీతం: నెలకు టగ్ హ్యాండ్లర్‌ పోస్టుకు రూ.50,000, మెరైన్‌ మోటర్‌ మెకానిక్‌, జి.పి క్ర్యూ, జి.పి క్ర్యూ ఇంజిన్‌కు రూ.23,400, జి.పి క్ర్యూ ఎలక్ట్రికల్‌, టెక్నికల్ సూపర్‌వైజర్‌కు రూ.28,800, ఫైర్‌ సూపర్‌ వైజర్‌కు రూ.40,000, సీమెన్‌ గ్రేడ్‌-2కు రూ.30,000, వించ్‌ ఆపరేటర్‌కు రూ.27,500.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11-03-2025.

Website:https://cochinport.gov.in/careers