Published on Sep 25, 2024
Walkins
కొచ్చిన్‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు
కొచ్చిన్‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు

ఎయిర్ ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్ఎల్‌)కు చెందిన కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (సీఐఏఎల్‌), కొచ్చిన్ ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 208

వివ‌రాలు:

1. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 03

2. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 04 

3. హ్యాండీమెన్/ హ్యాండీ ఉమెన్: 201

అర్హత: పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ప్రొడక్షన్/ ఎలక్ట్రానిక్స్‌/ ఆటోమొబైల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్‌ తప్పనిసరి.

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. 

జీతం: నెలకు ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.24,960; యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు రూ.21,270; హ్యాండీమెన్/ హ్యాండీ ఉమెన్ పోస్టులకు రూ.18,840. 

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎంట్రన్స్‌ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 1-10-2024.

ఇంటర్వ్యూ తేదీలు: 5,7-10-2024.

వేదిక: శ్రీ జగన్నాథ్ ఆడిటోరియం, వెంగూర్ దుర్గాదేవి ఆలయం దగ్గర, వెంగూర్, అంగమలీ, ఎర్నాకులం, కేరళ.

Website:https://www.aiasl.in/index