తపాలా సూచిక సంఖ్య (పోస్టల్ ఇండెక్స్ నంబర్-పిన్) కంటే మెరుగైన డిజిపిన్‌ను తపాలా శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.
పిన్ అనేది విస్తృత ప్రాంతాన్ని సూచించేది కాగా డిజిటల్ పిన్ మాత్రం కచ్చితంగా ఫలానా భవనం అని స్పష్టంగా చెబుతుంది.
చిరునామాను సులభంగా గుర్తించేందుకు సాయపడే 10 అంకెల సంకేతమే డిజిపిన్. దీనిలో అక్షరాలు, అంకెలు కలిపి ఉంటాయి.
మారుమూల ప్రాంతాలకు అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలు వంటివి కచ్చితంగా చేరుకోగలిగేలా దీన్ని తీసుకొచ్చారు.
ఐఐటీ హైదరాబాద్, ఇస్రోకు చెందిన జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం కలిసి దీనిని అభివృద్ధి చేశాయి.