ఆర్థిక వ్యవహారాల ఆడిట్ కోసం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ)ని ఏర్పాటు చేయనుంది. ఈ జాతీయ కేంద్రం ఆర్థిక ఆడిట్ రంగంలో ఆవిష్కరణలు, పరిశోధన, వృత్తిపరమైన అభివృద్ధికి తోడ్పడుతుందని డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కమర్షియల్, రిపోర్ట్ సెంట్రల్) ఏఎం బజాజ్ వెల్లడించారు.
అంతర్జాతీయంగా అమల్లో ఉన్న ఆడిట్ విధానాలు, నైపుణ్యాలు పెంచే కేంద్రంగా ఇది పనిచేస్తుందన్నారు. దీంతో ఆడిట్‌లు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటమే కాకుండా, ఈ రంగంలో ప్రపంచ బెంచ్‌మార్క్‌లను రూపొందించే స్థాయికి చేరతాయన్నారు.