Published on Apr 2, 2025
Current Affairs
కాగ్నిజెంట్‌ జీసీసీ సర్వీస్‌లైన్‌ గ్లోబల్‌ హెడ్‌
కాగ్నిజెంట్‌ జీసీసీ సర్వీస్‌లైన్‌ గ్లోబల్‌ హెడ్‌

అంతర్జాతీయ టెక్‌ సంస్థ కాగ్నిజెంట్, తన గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌(జీసీసీ) సర్వీస్‌ లైన్‌కు గ్లోబల్‌ హెడ్‌గా తెలుగువారైన శైలజా జోస్యుల నియమితులయ్యారు.

ఈమె హైదరాబాద్‌ కేంద్రంగా కాగ్నిజెంట్‌ అంతర్జాతీయ జీసీసీ కార్యకలాపాల వ్యూహాలు రూపొందిస్తారు.

కాగ్నిజెంట్‌లోనే 2018-24 మధ్య పలు నాయకత్వ హోదాల్లో ఈమె పనిచేశారు.

కాగ్నిజెంట్‌ హైదరాబాద్‌ సెంటర్‌ అధిపతిగా, బీఎఫ్‌ఎస్‌ఐ కార్యకలాపాల డెలివరీ విభాగం అధిపతిగా వ్యవహరించారు కూడా.