Published on Nov 20, 2024
Current Affairs
కక్ష్యలోకి జీశాట్‌-ఎన్‌2 ఉపగ్రహం
కక్ష్యలోకి జీశాట్‌-ఎన్‌2 ఉపగ్రహం

భారత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్‌-ఎన్‌2 2024, నవంబరు 19న విజయవంతంగా భూ కక్ష్యలోకి చేరింది.

స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా అమెరికాలోని కేప్‌ కెనావెరాల్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 4,700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లగల రాకెట్‌ భారత్‌ వద్ద లేకపోవడంతో విదేశీ సంస్థపై ఆధారపడాల్సి వచ్చింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వద్ద ఉన్న శక్తిమంతమైన రాకెట్‌ ఎల్‌వీఎం-3కి 4వేల కిలోల బరువైన ఉపగ్రహాన్ని మోసుకెళ్లే సామర్థ్యం మాత్రమే ఉంది. ఇస్రోకు, ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు మధ్య ఇదే తొలి వాణిజ్య భాగస్వామ్యం.