Published on Jul 4, 2025
Government Jobs
కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్‌ పోస్టులు
కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం, కాకినాడ జిల్లా ఆరోగ్య సమితి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పట్టణ ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీస్‌)లో తాత్కాలిక ప్రాతిపదికన రూరల్ అర్బన్ ఆషా వర్కర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. 

మొత్తం పోస్టులు: 42

వివరాలు:

గ్రామీణ ప్రాంతాల్లో: 29 పోస్టులు (చెబ్రోలు, దుగ్గుదురు, గోల్లపాలెం, పండూరు, సమర్ప, తురంగి, నాగులపల్లి, తేటగుంట తదితర ప్రాంతాలలో ఖాళీలు ఉన్నాయి).

పట్టణ ప్రాంతాల్లో: సుమారు 13 పోస్టులు (నరసింహారావు వీధి, రామారావుపేట, రెచ్చర్లపేట, కోకిలవాని హాస్పిటల్ రోడ్, శంకరయ్యపేట తదితర వార్డుల్లో ఖాళీలు ఉన్నాయి).

అర్హతలు:

టెన్త్‌ ఉత్తీర్ణత. అభ్యర్థులు ఆ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. వివాహితలు, భర్త చనిపోయిన వారికి, విడాకులైన వారు లేదా ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు ప్రాధాన్యత. తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. సామాజికంగా సేవా దృక్పథం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన, మెరిట్ లిస్ట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత పీహెచ్‌సీ/యూపీహెచ్‌సీలకు దరఖాస్తును రిజిస్టర్డ్ పద్ధతిలో సమర్పించాలి. దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవపత్రాలను జతపరచాలి.

దరఖాస్తుకు తేదీలు: 07-07-2025 నుంచి 09-07-2025 వరకు.

మెరిట్ లిస్ట్: 16-07-2025

అభ్యంతరాల స్వీకరణ: 17-07-2025 మరియు 18-07-2025.

తుది మెరిట్ లిస్ట్: 21-07-2025.

నియామక ఉత్తర్వుల జారీ: 25-07-2025.

Website:https://kakinada.ap.gov.in/