జేఎన్‌టీయూకే యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 194 దేశాల జాతీయ పతాకాలను 2024, డిసెంబరు 25న ఇన్‌ఛార్జి ఉపకులపతి మురళీకృష్ణ ఆవిష్కరించారు.
అన్ని దేశాలకు చెందిన జాతీయ పతాకాలు మన దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.
ఐక్యరాజ్యసమితి గుర్తించిన 194 దేశాల జెండాలు జెనీవా, అమెరికాలోని న్యూయార్క్, దక్షిణ కొరియాలోని సియోల్, చైనాలోని షాంఘై, డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటోడొమింగోలో ఉన్నాయి.