కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్) నవీ ముంబయి ఒప్పంద ప్రాతిపదికన జేటీఏ సిగ్నల్/టెలీ కమ్యూనికేషన్, టెక్నీషియన్ సిగ్నల్/టెలీకమ్యూనికేషన్ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 28
వివరాలు:
1. జేటీఏ సిగ్నల్/ టెలీకమ్యూనికేషన్: 04
2. టెక్నీషియన్ సిగ్నల్/టెలీ కమ్యూనికేషన్: 24
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు.
వేతనం: నెలకు జేటీఏ సిగ్నల్/టెలీకి రూ.43,380, టెక్నీషియన్ సిగ్నల్/టెలీకి రూ.37,500.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 ఆగస్టు 5, 7.
వేదిక: యూఎస్‌బీఆర్‌ఎల్ ప్రాజెక్ట్ ఆఫీస్, కొంకణ్‌రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, జ్యోతిపురం రోడ్, త్రినాథ, పోస్ట్ గ్రామోర్‌రాసి, జమ్మూ, జమ్మూకశ్మీర్(యూటీ)పిన్-182311.