Published on Oct 2, 2024
Walkins
కొంకణ్ రైల్వేలో టెక్నీషియన్‌ పోస్టులు
కొంకణ్ రైల్వేలో టెక్నీషియన్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన నవీ ముంబయిలోని కొంకణ్ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 33

వివ‌రాలు:

1. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 10

2. టెక్నీషియన్: 23

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్. 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా,  ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

* జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూ: 03-10-2024.

* టెక్నీషియన్స్‌ పోస్టులకు ఇంటర్వ్యూ: 08-10-2024.

వేదిక: ఎగ్జిక్యూటివ్ క్లబ్, కొంకణ్ రైల్వే విహార్, కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, సీవుడ్స్ రైల్వే స్టేషన్ దగ్గర, సెక్టార్-40, సీవుడ్స్‌ (పశ్చిమ) , నవీ ముంబయి.

Website: https://konkanrailway.com/