కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్), 1961/1973 అప్రెంటిస్ చట్టం ప్రకారం వివిధ విభాగాల్లో ఒక సంవత్సరం శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ & జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్స్.
మొత్తం ఖాళీలు: 190.
అర్హత: 2021 నుంచి 2025 మధ్య సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా NATS పోర్టల్‌లో నమోదై ఉండాలి.
వయోపరిమితి: 01.01.2026 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9,000, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.8,000 చెల్లిస్తారు (ఇందులో 50% DBT ద్వారా అందుతుంది).
ఎంపిక విధానం: అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా (మెరిట్ లిస్ట్) ఎంపిక చేస్తారు. కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్ కోసం భూమి కోల్పోయిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీలు & ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21 మార్చి 2026.