కేరళలోని కేఎస్‌సీఎస్‌టీఈ-ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమెట్ చేంజ్ స్టడీస్ (కేఎస్‌సీఎస్‌టీఈ-ఐసీసీఎస్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
వివరాలు:
1. ప్రాజెక్టు సైంటిస్ట్: 02
2. రీసెర్చ్ అసోసియేట్: 01
3. ప్రాజెక్టు ఫెలో: 01
4. టెక్నికల్ అసిస్టెంట్: 01
5. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 01
6. గార్డెనర్: 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ & పీహెచ్‌డీ(లైఫ్ సైన్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఫార్మసీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గార్డెనర్‌కు 45 ఏళ్లు, రీసెర్చ్ అసోసియేట్, టెక్నికల్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు, ప్రాజెక్ట్ ఫెలోకు 36 ఏళ్లు, ప్రాజెక్టు సైంటిస్ట్‌కు 38 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు గార్డెనర్‌కు రూ.20,000, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కు రూ.30,000, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.25,000, ప్రాజక్టు ఫెలోకు రూ.37,000, రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.70,000, ప్రాజక్టు సైంటిస్ట్‌కు రూ.1,00,000.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21 ఏప్రిల్ 2025