కేరళలోని కేఎస్‌సీఎస్‌టీఈ-ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమెట్ చేంజ్ స్టడీస్ (కేఎస్‌సీఎస్‌టీఈ-ఐసీసీఎస్) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్టు సైంటిస్ట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
వివరాలు:
1. ప్రాజెక్టు సైంటిస్ట్-3: 02
2. ప్రాజెక్టు సైంటిస్ట్-2: 03
3. ప్రాజెక్టు సైంటిస్ట్-1: 05
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డాక్టోరల్ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రాజెక్టు సైంటిస్ట్-3కి 45 ఏళ్లు, ప్రాజెక్టు సైంటిస్ట్-2కు 40 ఏళ్లు, ప్రాజెక్టు సైంటిస్ట్-1కు 35 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్టు సైంటిస్ట్-3కి రూ.78,000, ప్రాజెక్టు సైంటిస్ట్-2కు రూ.67,000, ప్రాజెక్టు సైంటిస్ట్-1కు రూ.56,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16 మార్చి 2025