సుప్రసిద్ధ చరిత్రకారుడు, విద్యావేత్త కె.ఎన్.పణిక్కర్(90) 2026, మార్చి 9న తిరువనంతపురంలో కన్నుమూశారు. ఈయన చరిత్ర రంగానికి సంబంధించి మహోన్నతమైన వ్యక్తి. చరిత్ర రచనల్లో మార్కిస్ట్ వివరణ, లౌకిక, శాస్త్రీయ విధానాలను అవలంభించినందుకు గానూ గుర్తింపు పొందారు. మతతత్వ విమర్శకుడిగా ప్రసిద్ధుడు. ఆధునిక భారత చరిత్ర అధ్యయనంలో ప్రగతిశీల దృక్పథాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.