డెయిరీ రంగ అభివృద్ధిలో దూరదృష్టి గల నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన కృషికి గాను హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వీసీఎండీ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక ‘ఔట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025’ లభించింది. ఇండియన్ డెయిరీ అసోసియేషన్ సౌత్‌జోన్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని కేరళ రాష్ట్రం కోజికోడ్‌లోని కాలికట్ ట్రేడ్‌సెంటర్‌లో నిర్వహించిన సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్‌క్లేవ్-2026 ప్రారంభ సభలో ప్రదానం చేశారు.