హరియాణా మాజీ ముఖ్యమంత్రి, జాట్ నేత, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) చీఫ్ ఓం ప్రకాశ్ చౌటాలా (89) 2024, డిసెంబరు 20న గురుగ్రామ్‌లో మరణించారు.
ఆయన 1989 నుంచి 2005 మధ్య అయిదుసార్లు హరియాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ఓం ప్రకాశ్ చౌటాలా 1935లో జన్మించారు. ఉప ప్రధానిగా పనిచేసిన చౌధరీ దేవీలాల్ అయిదుగురు సంతానంలో ఓం ప్రకాశ్ పెద్దవారు.