Published on Nov 19, 2024
Current Affairs
ఓపెన్‌ డోర్స్‌ రిపోర్ట్‌-2024
ఓపెన్‌ డోర్స్‌ రిపోర్ట్‌-2024

యూఎస్‌ఏకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ రూపొందించిన ఓపెన్‌ డోర్స్‌ రిపోర్ట్‌-2024ను న్యూదిల్లీలో 2024, నవంబరు 18న భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి విడుదల చేశారు.

ఇందులోని ముఖ్యాంశాలు..

అమెరికాలో చదువుకోవడానికి ఎక్కువ మంది విద్యార్థులను పంపించే దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. భారత్, చైనా తర్వాత జాబితాలో దక్షిణకొరియా, కెనడా, తైవాన్‌ దేశాలు ఉన్నాయి.

గత విద్యా సంవత్సరం (2023-24) నాటికి 3.30 లక్షల మంది విద్యార్థులతో భారత్‌ తొలిస్థానంలో నిలిచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398 మాత్రమే. 

అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థులు 11.26 లక్షల మంది ఉండగా.. వారిలో 29 శాతం మంది మనవాళ్లే.