ఆసియా ఛాంపియన్ జ్యోతి యర్రాజి తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణం నెగ్గింది.
2025, జూన్ 7న తైపీ సిటీలో జరిగిన 100మీ. హర్డిల్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది.
జ్యోతి 12.99 సెకన్లలో రేసును పూర్తి చేసింది.
ఆమె ఇటీవల దక్షిణ కొరియాలో ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి గెలిచింది.
జాతీయ రికార్డు (12.78సె) ఆమె పేరిటే ఉంది.
తైవాన్ ఓపెన్‌లో భారత్ మొత్తం ఆరు స్వర్ణాలు నెగ్గింది.