Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 29, 2026
Current Affairs
ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఒప్పందం
ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఒప్పందం
  • ఇంధన రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు దిగ్గజ సంస్థలు ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జట్టు కట్టాయి. చమురు-గ్యాస్‌ అన్వేషణ, వెలికితీత కోసం ఉపయోగించే రిగ్‌లు, సరఫరా నౌకలు, లాజిస్టిక్స్, ప్రత్యేక సముద్రగర్భ సామగ్రి లాంటి వనరులను సంయుక్తంగా పంచుకునే ఒప్పందంపై రెండు కంపెనీలు సంతకాలు చేశాయి.
  • దేశ తూర్పు తీరంలోని క్షేత్రాల్లో ముఖ్యంగా కృష్ణా గోదావరి (కేజీ) క్షేత్రం, అండమాన్‌ క్షేత్రాల్లో డీప్‌వాటర్‌ ఆఫ్‌షోర్‌ తవ్వక, ఉత్పత్తి కార్యకలాపాల్లోని వనరులను ఈ ఒప్పందం కింద రెండు సంస్థలు ఉపయోగించుకుంటాయని ఓఎన్‌జీసీ పేర్కొంది.