ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ దిల్లీ (ఓఎన్‌జీసీ) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ సివిల్ స్ట్రక్చరల్ ఇంజినీర్, జూనియర్ సివిల్ స్ట్రక్చరల్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
వివరాలు:
1. సీనియర్ సివిల్ స్ట్రక్చరల్ ఇంజినీర్: 01
2. జూనియర్ సివిల్ స్ట్రక్చరల్ ఇంజినీర్: 02
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 నవంబర్ 5వ తేదీ నాటికి సీనియర్ ఇంజినీర్‌కు 50 ఏళ్లు, జూనియర్ ఇంజినీర్‌కు 40 ఏళ్లు ఉండాలి.
వేతనం: సంవత్సరానికి సీనియర్ ఇంజినీర్‌కు రూ.60,00,000, జూనియర్ ఇంజినీర్‌కు రూ.40,00,000.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 2025 నవంబర్ 5.
Website:https://ongcindia.com/web/eng/career/recruitment-notice